Saturday 5 May 2012

లీడర్ గురించి ఖలేజుడు

మొదటి పోస్ట్ రాసి కొంత మనది అమాయకుల మీదికి ఉసి గొల్పిన  తరువాత , మళ్ళీ మళ్ళీ ఉసి గొల్పడానికి
 నా దగ్గర ఇంకేమీ లేవు ఎలా రా దేవుడా అని ఆలోచిస్తూ పక్కనే అమాయకంగా కూర్చున్న  "మాలోకం " ని అడిగాను .
" రే మొన్నే కదరా పాకడం మొదలెట్టింది అడుగులేయడానికి కొంచం సమయం పడుతుందిలే ఈ లోపు బుల్లి బుల్లి తప్పటడుగులు ఒకటో అరనో వెయ్యి " అని ఉచిత సలహా ఒకటి పడేశాడు.  సలహాని ఏరుకొని జేబులో వేసుకుంటే ఒక ఆలోచన వచ్చింది .అదేంటంటే నా మీద "లీడర్"  సినిమా ప్రభావాన్ని కొంచం సరదాగా రాసి పడేస్తే ఒక పని అయిపోతుంది కదా అని . అదన్న మాట సంగతి ... ఇంకే మరి చదవండి కాకపోతే నేను రాసిన దాన్ని khaleja   మహేశ్ style  లో చదువుకోండి.

దానబ్బ మూవీ   ఈ సినిమా ని భయ్యా రెండే రెండు సార్లు చుసాను. మొదటి సారి మా ఆస్థాన థియేటర్   "srinivaasa" లొ.. రెండో సారి అదేం మాల్ భయ్యా ... జనాలు బుల్లి బుల్లి బట్టలు వేసుకొని షికారు కి వస్తారు ... హా అదేదొ ఫొరం మాల్ అంట .. అక్కడ చుసాను. అంతే నా జీవితం  నాశనం.పడుకుంటే Leader, లేస్తే Leader, తింటే Leader... తాగితే Leader...చివరికి ఆఫీస్  లో ప్రోగ్రాం రాసేపుడు class name "Leader", file name "Leader.cpp" అని రాసేసాను. ఈ సినిమా చూస్తున్నంత సేపూ భయ్యా , నా రోమాలు "ముళ్ళ పంది వెంట్రుకల" లాగా  నిక్క పొడుచుకున్నాయంటె నమ్మవు భయ్యా !
ఈ సినిమా (ముఖ్యంగా dilaogues ) దెబ్బకి రాజకీయ నాయకులంటే కోపం వచ్చి చివరికి అది అసహ్యంగ మారింది. కనీసం రెండు నెలల వరకు డిస్తర్బ్ చెసింది భయ్యా నన్ను. (నిజానికి ఇన్స్పిరె చేసింది , కాని సగటు మానవుడి లాగె ఇన్స్పిరె అవ్వడం తప్ప ఏమి చెయలెక ఇలా కమెంటేసాను )
కొసమెరుపు: " అర్జున్ గారు , C.M  కొడుకు పంది  అయినా నాకు O.K నాకే కాదు ఈ దేశం లో ఏ అమ్మాయికైనా O.K"
ఆ మాటకొస్తే "C.M కూతురు అడవి పంది అయినా నాకు O.K. నాకే కాదు ఈ దేశం లో ... "  :D



అదండీ. నా ఈ బ్లాగు ప్రయాణం లో చిన్న అడుగు.
ఎపుడో చిన్నపుడు వేసిన అడుగు. తప్పటడుగు అయితే కామెంటండి , అసలు అడుగే కాదనుకుంటే తలంటండి :D (pedaraayudu mohan babu style lo)

1 comment: