Tuesday 10 July 2012

కోట - నవరస నటనా తోట

( ఏదో ప్రాస కోసం title అలా పెట్టాను.దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు  :) )
 "గణేష్" చుస్తే మంచి ప్రతి నాయకుడివి అనిపిస్తుంది... "అహ నా పెళ్లంట" చుస్తే ఓహో కొంచం comedy చేయగలవు అనిపిస్తుంది. "హలో బ్రదర్ " లాంటివి చూసాక కొంచం ఏంటి ఫుల్ లెంగ్త్ comedy చేయగలవు అనిపిస్తుంది. "ఆ నలుగురు" చూస్తేనేమో chracter artist role కూడా చేయగలవు అనిపిస్తుంది. సరే భాష విషయానికి వద్దాము. తెలంగాణ యాస తెలుసు , సీమ మాండలికం తెలుసు, కళింగాంధ్ర మాండలికం తెలుసు , సాగారంద్ర యాస లోను మాట్లాడగాలవు.
 మాస్టారు "కోట" గారు నీ నటన గురించి negtive గా మాట్లాడడానికి నాకేమి కనపడట్లేదు అందుకే నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకుండా ఉండలేకున్నాను

Saturday 12 May 2012

మొదటి చిన్న హైకూ

వర్షం కడిగేసింది
నేలతో పాటు మబ్బు పట్టిన ఆకాశాన్ని
 

గమనిక : కేవలం నా  మనసుకి తోచింది రాసాను. ఇంతకముందే ఇలాంటిదేమైనా  ఇంకెవరయినా రాసారెమో నాకు తెలియదు. ఒకవేళ హైకూ లా అనిపించక పొయినా లేక ఎక్కడయిన కపీ కొట్టినట్టు అనిపించినా కామెంటండి.

Saturday 5 May 2012

లీడర్ గురించి ఖలేజుడు

మొదటి పోస్ట్ రాసి కొంత మనది అమాయకుల మీదికి ఉసి గొల్పిన  తరువాత , మళ్ళీ మళ్ళీ ఉసి గొల్పడానికి
 నా దగ్గర ఇంకేమీ లేవు ఎలా రా దేవుడా అని ఆలోచిస్తూ పక్కనే అమాయకంగా కూర్చున్న  "మాలోకం " ని అడిగాను .
" రే మొన్నే కదరా పాకడం మొదలెట్టింది అడుగులేయడానికి కొంచం సమయం పడుతుందిలే ఈ లోపు బుల్లి బుల్లి తప్పటడుగులు ఒకటో అరనో వెయ్యి " అని ఉచిత సలహా ఒకటి పడేశాడు.  సలహాని ఏరుకొని జేబులో వేసుకుంటే ఒక ఆలోచన వచ్చింది .అదేంటంటే నా మీద "లీడర్"  సినిమా ప్రభావాన్ని కొంచం సరదాగా రాసి పడేస్తే ఒక పని అయిపోతుంది కదా అని . అదన్న మాట సంగతి ... ఇంకే మరి చదవండి కాకపోతే నేను రాసిన దాన్ని khaleja   మహేశ్ style  లో చదువుకోండి.

దానబ్బ మూవీ   ఈ సినిమా ని భయ్యా రెండే రెండు సార్లు చుసాను. మొదటి సారి మా ఆస్థాన థియేటర్   "srinivaasa" లొ.. రెండో సారి అదేం మాల్ భయ్యా ... జనాలు బుల్లి బుల్లి బట్టలు వేసుకొని షికారు కి వస్తారు ... హా అదేదొ ఫొరం మాల్ అంట .. అక్కడ చుసాను. అంతే నా జీవితం  నాశనం.పడుకుంటే Leader, లేస్తే Leader, తింటే Leader... తాగితే Leader...చివరికి ఆఫీస్  లో ప్రోగ్రాం రాసేపుడు class name "Leader", file name "Leader.cpp" అని రాసేసాను. ఈ సినిమా చూస్తున్నంత సేపూ భయ్యా , నా రోమాలు "ముళ్ళ పంది వెంట్రుకల" లాగా  నిక్క పొడుచుకున్నాయంటె నమ్మవు భయ్యా !
ఈ సినిమా (ముఖ్యంగా dilaogues ) దెబ్బకి రాజకీయ నాయకులంటే కోపం వచ్చి చివరికి అది అసహ్యంగ మారింది. కనీసం రెండు నెలల వరకు డిస్తర్బ్ చెసింది భయ్యా నన్ను. (నిజానికి ఇన్స్పిరె చేసింది , కాని సగటు మానవుడి లాగె ఇన్స్పిరె అవ్వడం తప్ప ఏమి చెయలెక ఇలా కమెంటేసాను )
కొసమెరుపు: " అర్జున్ గారు , C.M  కొడుకు పంది  అయినా నాకు O.K నాకే కాదు ఈ దేశం లో ఏ అమ్మాయికైనా O.K"
ఆ మాటకొస్తే "C.M కూతురు అడవి పంది అయినా నాకు O.K. నాకే కాదు ఈ దేశం లో ... "  :D



అదండీ. నా ఈ బ్లాగు ప్రయాణం లో చిన్న అడుగు.
ఎపుడో చిన్నపుడు వేసిన అడుగు. తప్పటడుగు అయితే కామెంటండి , అసలు అడుగే కాదనుకుంటే తలంటండి :D (pedaraayudu mohan babu style lo)

Wednesday 22 February 2012

ఇదే నా మొదటి బ్లాగ్ పోస్ట్

ఆహా ! నాకు ఇవ్వాళ పిచ్చ సంతోషంగా ఉంది. ఎందుకంటారా ? ఎందుకెంటండీ  బాబు (బాబు కి స్త్రీ లింగం ఎంటో నాకు తెలియదు) ఇదే కదా నా మొదటి పోస్ట్ . అదిగో కొందరు అపుడే నవ్వడం మొదలెట్టారు .
1)  ఏం మేము కాదా legends  మాకు ఉండకూడదా బ్లాగ్స్ ?  ( vajrotsav style lo)
2) అయ్యా ! ఎవరెవరో  రాస్తున్నరూ  ఏదేదో రాస్తున్నరూ  అలాంటపుడు నేను రాయడం లో తప్పేంటి అని అడుగుతున్నాను (మన మాజీ CM style )
3) ఏం మాట్లాడుతున్నారు మీరు ... మతి ఉండే మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాను .కష్టపడి  శ్రమదానం చేసి ఒక బ్లాగ్ రాస్తే నవ్వుతున్నారా ఇదేమి న్యాయం అని ప్రశ్నిస్తున్నాను . జై బ్లాగు భూమి !! జై జై బ్లాగు భూమి .( ఇది కూడా మన మాజీ CM  స్టయిల్ లో చదువుకోండి )
4) అరె ఆఖరికి మా పోరాగాండ్లు బ్లాగ్ రాసుకుంటే కూడా నవ్వుతూండ్రు ...  మీ వొల్లే రాసుకోవాలి కానీ తెలంగాణ ముద్దు బిడ్డలము  మేము రాసుకోవద్ద ఏంది ? గది కూడా సూత్తమ్ ఎన్ని రోజులు నవ్వుకుంటారో ఏ పాటి నవ్వుకుంటారో  సూత్తమ్ .
5) నేను మార్గదర్శి లో చేరాను ఒక బ్లాగ్ మొదలు పెట్టాను .
విషయం ఏంటంటే East India వాళ్ళు ఇండియా కి వచ్చినప్పటి నుండి  అనుకుంటున్నాను నాకంటూ ఒక బ్లాగ్ ఉండి అందులో నా పైశాచికత్వం  అంతా  ప్రదర్శించాలి అని . కానీ అబ్బే !! ఇప్పటికీ కుదిరింది .
సరేలే ఇప్పటి నుండి అయిన దీన్ని కొనసాగించాలని గట్టిగా తీర్మానించుకుంటున్నాను (దీన్ని అంతగా పట్టించుకోకండి  please ).